Home » మున్సిపల్ పోరులో ఎత్తుకు పై ఎత్తులు

మున్సిపల్ పోరులో ఎత్తుకు పై ఎత్తులు

Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.
ముగిసిన నామినేషన్ పర్వం
మిగిలిన ప్రచారం
రంగంలోకి ప్రధాన పార్టీలు
సై అంటే సై అంటున్న కొడవళ్లు
ఒంటరి పోరులో జనసేన
కాలు దువ్వుతున్న జాగృతి

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ పోరుకు సమయం ఆసన్నమైనది. నామిషన్ ఘట్టం ముగిసింది . ప్రచార పర్వం మిగిలింది. నాయకుల నాడీ వేడెక్కింది. ఒకవైపు సమ్మక్క జాతర. మరోవైపు మున్సిపల్ నామినేషన్ జాతర. నాయకుల ప్రచారానికి మిగిలింది పదిరోజులే. ఆ పదిరోజుల్లోనే ఓటర్లను ఆకట్టుకోవాలి. గెలవాలి. అందుకు బరిలో నిలిచిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలంటే అంత సులభం కాదు. సర్పంచ్ ఎన్నికల్లోనే యాబై లక్షల రూపాయలు ఖర్చు చేసిన నాయకులు ఉన్నారు. ఇంచు మించుగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక్కో అభ్యర్థికి అదే స్థాయిలో ఓటర్లు ఉంటారు. అంటే ఇక్కడ కూడా ఒక్కో నాయకుడు యాబై లక్షల రూపాయలతోనే బరిలో నిలవాలి. అంత ఆర్థిక స్తొమత ఉన్నవారికే పార్టీలు బి ఫారం తో పట్టం కడుతున్నాయి.

మొత్తం ఓటర్లు ఎందరు. గతంలో ఎన్ని ఓట్లు పోలైనాయి. కులాల వారిగా ఎన్ని ఓట్లు. ప్రధానంగా మైనార్టీ ఓట్లు ఎన్ని. ఉపాధి కోసం వెళ్లిన ఓటర్లు ఎందరు. ముక్యంగా యువతీ, యువకులను ఆకట్టుకోవడం ఎలా ? దూరప్రాంతాల్లోని వారు తనకే ఓటు వేయాలంటే ఏం చేయాలి ? రోజుకు ఎంత మంది ఓటర్లను కలవాలి. రెబల్ పోటీలో ఉంటె ఎలా తప్పించాలి. ఇలా లెక్కల్లో మునిగిపోయారు ఆశావాహులు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *