NIGAMA MEDIA (P) LTD
17.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

BRS : పల్లెపోరులో కారు పరుగులు పెట్టేనా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

BRS : పల్లె పోరుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నవి. కారు పార్టీ కూడా ప్రధాన పార్టీలతో కలిసి కాలు దువ్వుతోంది. కమలం నేతలకు కేంద్రం మద్దతు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం. గులాబీ పార్టీ అధికారంకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థులు ఇతరులతో సమానంగా పరుగులు పెట్టేనా అంటూ గులాబీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం అధినేత ఇంటికే పరిమితమైనారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా హైదరాబాద్ లో ఉండే అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు. సీనియర్ నేతలు కూడా హైదరాబాద్ లో ఉండే మీడియాతో మాట్లాడుతున్నారు. జిల్లాలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉన్న జిల్లా అధ్యక్షులను కూడా వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. వీరంతా ప్రజలకు కేటాయించిన సమయం కూడా అతి తక్కువే. కవిత పార్టీ నుంచి బయటకు రావడం పార్టీపై ప్రభావం పడింది.

స్థానిక సంస్థల ఎన్నికలు పాములా వెంటాడే పరిస్థితి ఉంది. సర్పంచి ఎన్నికల్లో ఒకవేళ పరాభవం ఎదురైతే ఆ తరువాత వచ్చే ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బంది తప్పదు. ఆ తరువాత వచ్చే మున్సిపల్ ఎన్నికలకు కూడా పార్టీ నష్టాన్ని మూట కట్టుకోక తప్పదు. గ్రేటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పరాభవం ఎదురైతే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఊహించడం కష్టమే అంటున్నారు పలువురు గులాబీ శ్రేణులు.
——————————————–

పొలిటికల్ బ్యూరో ,
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.
9603982983.
——————————————-

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.