NIGAMA MEDIA (P) LTD
17.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

Singareni : సమన్వయ లోపంతోనే శాంతిఖని కి నష్టం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి శాంతిఖని గనికి సంబంధిత బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టర్ కు, అధికారులకు మధ్య సమన్వయ లోపంతోనే నష్టం వాటిల్లుతున్నదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి ఆరోపించారు. బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో గని ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ…….

 

సంబంధిత కాంట్రాక్టు గని అధికారులు, ఏరియా ఉన్నతాధికారుల నిబంధనలను అమలు చేయకపోవడంతోనే గని నష్టాల్లోకి కూరుకు పోయిందని వెంకటస్వామి ఈ సందర్బంగా ఆరోపించారు. ప్రాజెక్ట్ అధికారులు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా గని నష్టాలకు ఒక తార్కాణమన్నారు. అధికారులకు చిత్త శుద్ధి లేకపోవడంతోనే సంబంధిత కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం వహించాడని ఆయన ఆరోపించారు. గని బొగ్గు ఉత్పత్తి కోసం గతంలో పలువురు అధికారులు చేసిన తప్పిదాలను సవరించుకోవాలన్నారు. నష్టాలకు కారకులైన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చిప్ప నరసయ్య , శాంతిఖని గని అసిస్టెంట్ సెక్రటరీ మంతెన రమేష్, కాశీపేట పిట్ సెక్రటరీ మీనగు లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ రాజేందర్, శాంతి గని సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, క్యాంటీన్ కమిటీ సభ్యులతో పాటు కాశీపేట మైన్ కమిటీ సభ్యులు దాడి రమేష్, మహంకాళి సంతోష్, రత్నం ప్రవీణ్, పొట్ల రాయలింగు, భాస్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్,బొంకురి రామచందర్, శ్రీకాంత్, కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.