NIGAMA MEDIA (P) LTD
17.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, September 10, 2026

CPM : బెల్లంపల్లి మాస్టర్ ప్లాన్లు బహిర్గతం చేయాలి.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే వినోద్ జోక్యం చేసుకోవాలి
28 నుంచి నిరసన కార్యక్రమాలు
సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

CPM : బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పేరిట చిరువ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్న అధికారులు వెంటనే మాస్టర్ ప్లాన్ ను బహిర్గతం చేయాలని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలో పార్టీ నాయకుల, కార్యకర్తలు, వ్యాపారుల ఆధ్వర్యంలో చల్లురి దేవదాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 30 మందితో పోరాట కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా సంకె రవి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…..

నెల రోజుల కిందట కూల్చివేసిన దుకాణ యజమానులను నేటివరకు అడ్డుకోలేదు. మరోసారి మరికొన్ని దుకాణ సముదాయాలను కూల్చడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మొదట కూల్చివేసిన దుకాణ యజమానులను అన్నివిధాలుగా ఆదుకున్న తరువాతనే ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పేరిట చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వేలాది మందికి ఉపాధి చూపెడుతున్న బెల్లంపల్లి పట్టణం కూల్చివేతలతో నిర్వీర్యం కాబోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. .నష్టపోయిన వ్యాపారులను ఆదుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పైననే ఉన్నప్పటికీ ఆయన స్పందించకపోవడంపై రవి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్ అనుభవం ఉన్న నాయకుడిగా వెంటనే నష్టపోయిన వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ బాధితుల పోరాట కమిటీ కన్వీనర్ గా చల్లూరి దేవదాస్, కో కన్వీనర్లుగా రామ్మోహన్, శకుంతలను ఎన్నుకున్నారు. నవంబర్ 28 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దాగం రాజారాం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దాగం శ్రీకాంత్ తోపాటు వ్యాపారాలు మేకల రాజన్న, బొనగిరి సురేష్, రమేష్, శకీల్, ఖాజా బాబా, మనసాని సురేష్ బాబు, CH శ్రీకాంత్, D.వెంకటేశ్వర్లు. కిషన్,సాదిక్, వెంకటేష్, ఇందారపు భీమక్క, రాజేశం, జిలానీ పాషా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.