NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, September 12, 2026

CPM : ప్రపంచానికే ఆదర్శంగా కేరళ అభివృద్ధి.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CPM : దిన,దినం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కేరళ రాష్ట్రము ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ…..

కేరళలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే గీటురాయిగా పరిపాలన అందిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడంలో విశేషమైనటువంటి కృషి జరుగుతోంది. 100% అక్షరాస్యత, ఆహార పదార్థాల కల్తీ నివారణ, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, ఉచిత ప్రభుత్వ వైద్యం, కనీస వేతనాలు అమలు చేయడం , అర్హులైన వారికి ఇంటి నిర్మాణం, 14 రకముల నిత్యావసర సరుకులను సరఫరా చేయడం వంటి పథకాలను అమలు చేస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శముగా నిలుస్తోందన్నారు. ఇది కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే అమలు కావడం విశేషమన్నారు.

2021లో తీవ్ర పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేసి 64 వేల కుటుంబాలను గుర్తించడం జరిగింది. తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వాళ్లందర్నీ 2025 నవంబర్ 1 నాటికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే పని ప్రభుత్వం చేయాలని లక్ష్యంగా కేరళ ప్రభుత్వం పెట్టుకొందన్నారు. అర్హులైన నిరుద్యోగులకు రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా ఆవహివృద్ది చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులతో పాటు ఏర్మ పున్నం, అభినవ్, అర్షవర్దన్ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.