CPM : ప్రపంచానికే ఆదర్శంగా కేరళ అభివృద్ధి.

CPM : దిన,దినం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కేరళ రాష్ట్రము ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ..... కేరళలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎల్ డి ఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్నే గీటురాయిగా పరిపాలన అందిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించడంలో విశేషమైనటువంటి కృషి జరుగుతోంది. 100% అక్షరాస్యత, ఆహార పదార్థాల కల్తీ నివారణ,...