NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Megastar : ముస్సోరి లో సందడి చేస్తున్న మెగాస్టార్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Megastar : చిరంజీవి సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో ఎన్నో ఆశలు ఉంటాయి. మెగాస్టార్ తో పెట్టుబడులు పెడితే నష్టపోమనే నమ్మకం కూడా నిర్మాతల్లో ఉంది. అందుకనే ఆయన ఖాళీ సమయం కోసం పెట్టుబడి దారులు ఎదురుచూస్తుంటారు. మెగా సినిమాలో డ్యాన్స్, ఫైట్, కు తోడుగా కామెడీ కూడా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు అపజయాలు తక్కువ, విజయ వంతం ఎక్కువ.

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ నటిస్తోన్న 157 ప్రాజెక్ట్ చాలా వేగంగా షూటింగ్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరుకు, పేరు, లాభాలకు లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా పై దర్శకుడు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ప్రాజెక్ట్ 157 లో మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయడానికి చిత్ర బృందం ముస్సోరి వెళ్ళింది. అక్కడికి చిరంజీవి కూడా వెళ్లారు. మెగాస్టార్ తో కొన్ని సన్నివేశాలని కూడా అక్కడే పూర్తి చేయనుంది చిత్ర బృందం. అదే విదంగా ఈ బృందంలో హీరోయిన్ నయనతార కూడా వెళ్ళింది. చిరంజీవి, నయనతార లతో ఒక పాటను కూడా పూర్తి చేయాల్సి ఉందని, ముస్సోరిలోనే పాటను పూర్తి చేయనున్నారు. అభిమానుల ఆశయాలకు తగ్గట్టుగా సినిమా నిర్మించి సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం కృషి చేస్తోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.