24.4 C
Munich
Sunday, July 26, 2026

KTR : కేటీఆర్ మాటల్లో అహంకారమా ? ఆవేశమా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఎక్కువగా మాట్లాడేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించే. అందులో సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతారు. అధికారం పోయిందని మాట్లాడుతున్నారా ? లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నారా ? ఆవేశంతో మాట్లాడుతున్నారా అనే విషయం కూడా ఆయన అంతరంగానికే తెలియాలి. బుధవారం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్నారు. తన తండ్రిని లక్ష్యం చేసుకొని కాళేశ్వరం నింద మోపుతున్నారనేది కేటీఆర్ ఆవేదన. కానీ కేటీఆర్ మాట్లాడిన మాటల్లో అహంకారం అనేది ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. అంతు చూస్తామని హెచ్చరించడం, ఆవేశపడటం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, గతంలో తామెంతో గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకోవడాన్ని వింటుంటే ఆయనకున్న అహంకారం అనేది ఏమిటో తెలిసిపోయింది.

వెయ్యి జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం ఏమిటనేది అర్థం కాదని, రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ అంటూ మాట్లాడినారు. అంతే కాదు రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు అంటూ ఆవేశంతో కడుపులో ఉన్నదంతా కక్కేశారు. కేసీఆర్ పదవి పోయేలా రేవంత్ రెడ్డి చేశారనే విషయం కేటీఆర్ కు ఇంకా అర్థం కానట్టు ఉంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేలా చేసేసిండు. ఇంకా వెంట్రుక కూడా పీకలేడని మాట్లాడటంలో అర్థం లేదు.

ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ అంటూ కేటీఆర్ కాస్త గట్టిగానే చెప్పుకున్నారు. అంటే చంద్రబాబు గురించే మాట్లాడారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎక్కువ కాలం చంద్రబాబు దగ్గర పని చేసిన విషయం తెలియదా ? తెలిసే మాట్లాడారా ? అనే విషయం కేటీఆర్ కె తెలియాలి. ఇతరుల గురించి చులకనగా మాట్లాడి, తన గురించి గొప్పగా చెప్పుకోవడం రాజకీయం అనరు. అది అహంకారమే అవుతుంది. అహంకారంతో రాజకీయంగా ఎదుగకుండా, కనుమరుగయిన నాయకులు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ఉన్నారు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.