24.4 C
Munich
Sunday, July 26, 2026

Money : ఆ ఐదు గుణాలు ఉన్న వ్యక్తులకు డబ్బు ఇస్తే జరిగేది ఇదే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Money : మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో భాద్యతలు చేపట్టిన చాణక్యుడు తన నీతి దర్పణం పుస్తకంలో డబ్బు విలువ గురించి చక్కగా వివరించాడు. డబ్బుకు పద్ధతులను కూడా తన పుస్తకంలో వివరించాడు. ఎవరైనా సరే ఈ ఐదు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బు ఇవ్వరాదని తన పుస్తకంలో పొందుపరిచాడు. వారికి డబ్బు ఇవ్వడంకంటే ఇంటిలో దాచుకోవడం ఉత్తమమని అన్నాడు. ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…..

1) చెడు గుణాలు ఉన్న వారు….. వీరికి డబ్బు ఇచ్చిన వారు ఇబ్బందులను కొని తెచుకున్నట్టవుతుంది.

2) అసంతృప్తితో ఉండేవారు …. నిత్యం అసంతృప్తితో ఉంటూ ఎదో కోల్పోయిన వారికీ అసలే డబ్బు ఇవ్వరాదు. ఎందుకంటే వారికి ఎంత డబ్బు ఉన్నా సరిపోదు.

3) బాధ్యతారహితమైన వ్యక్తులు….వీరికి ఎలాంటి భాద్యతలు ఉండవు. తినడం, తిరగడం మినహా ఎలాంటి పనులు చేయరు.

4) మద్యం అలవాటు ….. మద్యం అలవాటు ఉన్నవారికి డబ్బు ఇవ్వడం పెద్ద పొరపాటు. తమ అలవాటు కోసం అప్పు కోసం తిరుగుతారు.

5) ఈర్ష్య పడేవారు ….. వీరు ఎప్పుడు కూడా ఒకరి సంపాదన మీదనే ఈర్ష్య పాడుతారు. పని చేసుకుందామని ఆలోచన ఉండదు. కాబట్టి ఈ ఐదు గుణాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయరాదు. వీరి అవసరాలకు డబ్బు ఇవ్వరాదని చాణక్యుడు తన నీతి దర్పణం పుస్తకంలో స్పష్టం చేసాడు.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.