NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Congress : కాంగ్రెస్ ను హెచ్చరించిన కొత్తప్రభాకర్ రెడ్డి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Congress : కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులు ఉంటుందని ఒకరు. ముఖ్యమంత్రి మారుతున్నాడని మరొకరు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ మాట్లాడిన వారి మాటల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ గులాబీ శ్రేణుల్లో కీలక నేత కొత్త ప్రకాష్ రెడ్డి ఇటీవల మాట్లాడిన మాటలు మాత్రం దుమారం రేపాయి. అంతేకాదు అన్ని పార్టీలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ఉండంటూ హెచ్చరించినట్టుగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమంటూ కొందరు బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారని, అదే విదంగా ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత డబ్బు అయినా సమకూరుస్తామంటున్నారని బీఆర్ఎస్ కీలక నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవల మాట్లాడిన మాటలు బిఆర్ఎస్ కు చాలా నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ ఎలా స్పందించినప్పటికీ అంతర్గతంగా మాత్రం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయక తప్పదు.

ప్రభాకర్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినప్పటికీ ఆయన మాటల్లో రెండు అర్థాలు కనబడుతున్నాయి. ఒకటి మైండ్ గేమ్ లో భాగంగా మాట్లాడినట్టుగా ఉంది. రెండోది కాంగ్రెస్ పార్టీ కి శ్రేయోభిలాషిగా మాట్లాడినట్టుగా ఉంది. అంటే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్టుగా ఉంది. అంటే బిఆర్ఎస్ తరుపున మైండ్ గేమ్ ఆడినారా ? లేదంటే సీఎం రేవంత్ రెడ్డికి శ్రేయోభిలాషిగా మారి ముందస్తుగా హెచ్చరించారా అనే విషయం ప్రభాకర్ రెడ్డికే తెలియాలి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నప్పట్టికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్టుగానే ఉందనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.