NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Pudina : పుదీన తో జరిగే మేలు తెలిస్తే వదిలిపెట్టరు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Pudina : పుదీనా మంచి సువాసన కలిగిన ఆకు. దాని వాసన తగిలితే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లో వాడుతారు. పచ్చడి చేస్తారు. పుదీనా జ్యుస్ తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుదీనా రసం వాడటం వలన శరీరానికి ఆరు లాభాలు కలుగుతాయని కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పుదీనా మౌత్ ఫ్రెషనర్‌గా మంచి ఫలితాలను ఇస్తుంది. దీని సువాసన దుర్వాసనను తొలగిస్తుంది. దీనిలో ఉన్న యాంటీ బాక్టీరియాలు నోటి లోని బ్యాక్టీరియాను తొలగిస్థాయి. శ్వాసను తాజాగా ఉంచుతుంది.

చర్మ సమస్యలు ఉంటె తొలగిపోతాయి. మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. రసాన్ని ముఖానికి అప్లై చేయడం వలన ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. జీవక్రియను సక్రమంగా ఉంచుతుంది. జ్యుస్ తాగడం వలన ఆకలిగా ఉండదు. వెంట, వెంట తినాలనే కోరిక ఉండదు.

జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని పెంచుతుంది. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది.

పుదీనా టీ తాగడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పుదీనా చల్లదనాన్ని అందిస్తుంది. ఒత్తిడి, తలనొప్పి సమస్యనుంచి ఉపశమనం పొందుతాము.

పుదీనా రసం తాగితే జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.