Home » Singareni : ధర్మల్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా

Singareni : ధర్మల్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా

రోజుకు 2.6 లక్షల టన్నులకు తగ్గకుండా ఉత్పత్తి చేయాలి
17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి
అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు
సింగరేణి సీ & ఎండీ ఎన్. బలరామ్

Singareni : పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేయాలనీ సింగరేణి సీ & ఎండీ ఎన్. బలరామ్ సింగరేణి పరిధిలోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసారు. శనివారం ఆయన జనరల్ మానేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా కూడా చేయాలని ఆదేశించారు. అదే విదంగా ప్రతిరోజూ కనీసం 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగిస్తేనే, బొగ్గు ఉత్పత్తిని సకాలంలో పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.

వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం తప్పదన్నారు. సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును నిర్ణిత సమయంలో సరఫరా చేయాలని స్పష్టం చేశారు. బొగ్గు సరఫరా విషయంలో రైల్వే విభాగంతో సమన్వయం చేసుకోవడం తప్పని సరన్నారు. బొగ్గు ఉత్పత్తి చేయడంలో రక్షణతో పాటు నాణ్యతకు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం తప్పని సరన్నారు. నాణ్యత, రక్షణ విషయంలో ఏరియాలోని అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఉత్పత్తిలో వెనుక బడిన ఏరియాలు కెటాయించిన లక్ష్యాన్ని సాధించే విదంగా కృషిచేయాలన్నారు.

ఈ సమావేశంలో జీఎం (కో ఆర్డినేషన్) ఎస్డి.ఎం.సుభానీ, జీఎం(మార్కెటింగ్) రవి ప్రసాద్, జీఎం (సీపీపీ) మనోహర్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *