NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Thirumala : తిరుమలలో ఆకస్మిక తనికీలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Thirumala : ఏడుకొండలపై వెలసిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తనికీలు చేపట్టారు. దేవస్థానం పరిధిలోని వివిధ సేవా సంస్థలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనికీలు చేపట్టారు. ఒక్కసారిగా తనికీలు మొదలు కావడంతో సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది షాక్ కు గురయ్యారు.

మొదట తిరుమల లోని పరకామణి భవనాన్ని ఆయన పరిశీలించారు. ⁠నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర దేశాల నాణేలు ,కానుకల లెక్కింపు ఏవిదంగా చేస్తారని అడిగి తెలుసుకునాన్రు. అదే విదంగా వాటి విభజన ప్రక్రియను చేపట్టిన విధానం గురించి అడిగి తెలుసు కున్నారు. పరకామణి సేవలో పాల్గొనే సిబ్బందిని ఏవిదంగా తనిఖీ చేస్తారు. పరకామణి కేంద్రంలో సాంకేతికంగా ఎలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు అనే అంశాలను ఆరాతీశారు.

అక్కడి నుంచి నేరుగా బూందీ పోటులో తనికీ చేపట్టారు. పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. లడ్డు కు ఉపయోగించే నెయ్యి, పప్పు, కాజు, కిస్మిస్ పదార్థాల విషయంలో నాణ్యత విషయంలో కఠినంగా ఉండాలన్నారు. అగ్నిప్రమాదాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఫిబ్రవరి నాలుగున నిర్వహించే రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మాడవీధుల్లో చేపట్టిన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు రానున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.