NIGAMA MEDIA (P) LTD
19.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, September 14, 2026

ఆగష్టు 2న బీబీపేటలో బోనాల పండుగ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

బీబీపేట మండల కేంద్రంలో ఆగస్టు 2న నిర్వహించనున్న శ్రీ మహంకాళమ్మ బోనాల పండుగ జాతరను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు సమావేశమై బోనాల జాతర నిర్వహణపై చర్చించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిర్ణయించారు.

అలాగే బోనాల పండుగలో గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ మహంకాళమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయి, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రముఖులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.