Home » Kamareddi : ఫ్లెక్సీ లను తొలగించిన అధికారులు

Kamareddi : ఫ్లెక్సీ లను తొలగించిన అధికారులు

Kamareddi :తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దింతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీ లను తొలగించారు.

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సంభందిత అధికారులు ముందస్తుగా పలు పార్టీలకు చెందిన నాయకులకు ఫ్లెక్సీ లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరు కూడా తొలగించకపోవడంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది వాటిని తొలగించక తప్పలేదు. ఎన్నికల నిబంధనను ఎవరైనా అతిక్రమించినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *