Home » Mahesh babu : ఆ ఊరిలో హీరో మహేష్ బాబు ఆమె కోసం ఏమి చేసాడో తెలుసా ?

Mahesh babu : ఆ ఊరిలో హీరో మహేష్ బాబు ఆమె కోసం ఏమి చేసాడో తెలుసా ?

Mahesh babu : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు హీరో మహేష్ బాబుకు తన భార్య, పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారి కోసం ఎంత ఖర్చు చేయ డానికయినా వెనుకాడరని పేరుంది. మహేష్ బాబు పెళ్లి రోజు, భార్య పిల్లల పుట్టిన రోజు, తల్లి విజయ నిర్మల, తండ్రి హీరో కృష్ణ పేర్లతో సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఇష్టం. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఫీజు చెల్లించడం, అన్నదానం కార్యక్రమాలు చేయడానికి మహేష్ బాబు ఎప్పుడు కూడా ముందుంటారు.

ఇప్పుడు మహేష్ బాబు ఒక ఊరిలో , ఆమె కోసం ఒక సేవా కార్యక్రమాన్ని చేశాడని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది. ఆమె ఎవరో కాదు. అయన సతీమణి నమ్రతా శిరోద్కర్. ఇటీవల ఆమె పుట్టిన రోజు పురస్కరించుకొని తన సొంత ఊరు బుర్రిపాలెం లో ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని చూసిన ఆ ఊరి ప్రజలతో పాటు, అయన అభిమానులు సైతం మహేష్ బాబును అభినందించారు. ఇంతకూ తన భార్య పుట్టిన రోజున ఏమి చేసాడంటే….

బుర్రిపాలెం ఊరిలో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి మహిళలకు టీకా వేయించారు. సుమారు 70 మందికి పైగా హెచ్ పీవీ వాక్సిన్ అందజేశారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తన సొంత ఊరు బుర్రిపాలెం లో తన భార్య పుట్టిన రోజున వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయడంతో ఆ గ్రామస్తులు అభినందించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *