Rashmika : అందాల కన్నడ భామ రష్మిక చేతినిండా సినిమాలు. వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఒక్క భాష సినిమాకే పరిమితం కాకుండా వివిధ భాషల్లో నటిస్తోంది. బోలెడంత అభిమానులను సంపాదించుకొంది. పుష్ప-2 సినిమాతో తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. తిరుగులేని నటిగా వెలిగిపోతున్న రష్మిక కు ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
హీరోయిన్ రష్మిక, విక్కీ కౌశల్ జంటగా ఛవా సినిమాలో నటించారు. ఇటీవలనే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ పై కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహారాష్ట్ర వాసులు ‘ఛావా’ సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. సినిమా విడుదలను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
‘చావా’ సినిమా ట్రైలర్‌లో ఓ డ్యాన్స్ సీన్ ప్రదర్శించారు. రష్మిక, విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యం అది. మరాఠీ ప్రజలు ఈ సీన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందనేది మహారాష్ట్ర వాసుల వాదన . సినిమాలో చూపించినట్లుగా, పట్టాభిషేకం తర్వాత ఇలా డ్యాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్‌ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్మిక నటించిన ఈ సినిమా వివాదంలో చిక్కుకొంది.