NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Ellamma : “ఎల్లమ్మ ” ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ellamma : జబర్దస్త్ నటుడు వేణు బలగం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక వెనుదిరిగి చూడకుండానే తన రెండో సినిమా కోసం రంగంలోకి దిగారు. బలగం సినిమా మాదిరిగానే తన రెండో సినిమా పెద్ద హిట్ సాధించాలని మంచి కథతో సిద్ధమయ్యారు. ఆ రెండో సినిమా పేరే “ఎల్లమ్మ ”

ఎల్లమ్మ షూటింగ్ మొదలైనది. కానీ ఎందుకో ఆలస్యం అవుతోంది. ఆలస్యం కావడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, ప్రధాన కారణం ఒక్కటే. హీరో తో పాటు ఎల్లమ్మ పాత్రకు సరిపోయే హీరోయిన్ కావాలి. ఎట్టకేలకు హీరోను ఎంపిక చేశారు. హీరోగా నితిన్ ను నిర్మాత దిల్ రాజు ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అనే సమస్య ఎదురైనది. రెండు, మూడు పేర్లు వినిపిస్తున్నప్పటికీ పరిశ్రమలో మాత్రం ఆమె హీరోయిన్ అని ఎవరు కూడా గట్టిగా చెప్పలేక పోతున్నారు.

చివరకు హీరోయిన్ గా, ఎల్లమ్మ పాత్రకు సరిపడే నటి సాయి పల్లవి అనే పేరు బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా తో పాటు చిత్ర పరిశ్రమలో కూడా ఎల్లమ్మ పాత్రకు సాయి పల్లవి ని ఎంపిక చేసిందనే వార్త గుప్పుమంది. వాస్తవానికి సాయి పల్లవి నటిస్తే మాత్రం ఎల్లమ్మ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అంతే కాదు బలగం వేణు పోయి ఎల్లమ్మ వేణు అయిపోతారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.