Home » Mla Malla reddi : జిమ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బిజీ బిజీ

Mla Malla reddi : జిమ్ లో ఎమ్మెల్యే మల్లారెడ్డి బిజీ బిజీ

కసరత్తులు చేస్తున్న మల్లారెడ్డి
యూత్ తో కలిసి పోటీపడుతున్న మల్లారెడ్డి
ఏడు పదుల వయసులోనూ కసరత్తులు

Mla Malla reddi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి మాట్లాడినా, గంతులేసినా వార్తల్లో నిలిచిపోతారు. తనదయిన శైలిలో మాట్లాడుతూ రెచ్చిపోతారు. ప్రతిసారి తన కంటూ ఏదో ఒక సంఘటనను సృష్టిస్తారు. తన గురించి తానూ గొప్పగా చెప్పుకోవడంలో కూడా రెచ్చిపోయి మాట్లాడుతారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

మల్లారెడ్డి ఈ సారి జిమ్‌లో కండలు పెంచుతూ కనిపించరు. కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. మనవలు, మానవరాళ్లతో కలిసి సరదాగా గడపాల్సిన ఆయన జిమ్ లో కండలు పెంచుతూ జిమ్ లో సరదాగా గడుపుతున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఆయన జిమ్ లో తన తోటి వారితో పోటీ పడుతూ కసరత్తు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గతంలో ఒకసారి వేదికపై డీజే టిల్లు తో కలిసి డ్యాన్స్ చేశారు. మరోసారి తన మనవరాలి పెళ్ళిలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజగా మల్లారెడ్డి పాలు అమ్మిన, పూలు అమ్మిన, బోరింగ్ నడిపించిన అనలేదు. జిమ్ లో కసరత్తులు చేస్తూ వార్తల్లోకెక్కారు. కసరత్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *