news : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక లో ఎడిషన్ ఇంచార్జ్. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ కు భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు అవసరం ఉండి డబ్బులు తీసుకున్నాడో ? లేదంటే ఈయనకు అవసరం ఉండి ఆయన అవసరానికి డబ్బులు ఇచ్చాడో తెలియదు. కానీ ఇద్దరి ఫోన్ సంభాషణ వింటే మాత్రం ఆ పత్రిక రిపోర్టర్ వద్ద మాత్రం ఆ ఎడిషన్ ఇంచార్జ్ డబ్బులు తీసుకున్నట్టుగా ఆరోపణ బయటకు వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. పత్రిక పుట్టిన నాటి నుంచి ఆయన రిపోర్టర్ గా ఒక డివిజన్ స్థాయి కేంద్రానికి పనిచేస్తున్నారు.
సంఘటన వివరాలు సోషల్ మీడియా లో ఈ విదంగా వైరల్ అవుతున్నాయి…… ఆ ఎడిషన్ ఇంచార్జ్ అడగగానే రిపోర్టర్ రూ : 18, 000 పంపినట్టు సదరు రిపోర్టర్ ఆరోపిస్తున్నారు. ఎడిషన్ ఇంచార్జ్ చెప్పిన ఫోన్ పే నెంబర్ కు పంపినట్టుగా రిపోర్టర్ చెబుతున్నారు. డబ్బులు అడిగినందుకు ఇప్పుడు ఆ రిపోర్టర్ ను కూడా విధుల్లో తప్పులను కారణం చూపుతూ తొలగించాడు. గత ఇరువై నెలల నుంచి డబ్బులు అడిగితే తప్పించుకుంటున్నాడు. చివరకు రిపోర్టర్ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. రిపోర్టర్ తెలివిగా మరొక నెంబర్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు అడిగితే బూతుల పురాణం మొదలు పెట్టాడు. ఇదంతా కూడా ఆ రిపోర్టర్ రికార్డ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేశాడు. జర్నలిజంలో బాధ్యతగల హోదాలో ఉండి బూతులు తిట్టడం తో పలువురు రిపోర్టర్ లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లలో అసహ్యించుకుంటున్నారు.
ఆ ఎడిషన్ ఇంచార్జ్ కరీంనగర్ లో ఉండకుండా తన సొంత ఊరినుంచి విధులు నిర్వహిస్తున్నారు. తన ఊరికే తనకు అవసరమైన రిపోర్టర్ లను పిలిపించుకుంటాడు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అంతే కాదు అయన గారికి సురాపానం అవసరమైనప్పుడు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే తెప్పించుకుంటాడు. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక రిపోర్టర్ నిత్యం ఆర్టీసీ బస్సు ద్వారా పట్టు తేనే పంపిస్తాడు అనే ప్రచారం కూడా ఉంది. అవసరాలకు ఆదుకునే రిపోర్టర్ల వార్తలు అందంగా ఎడిటింగ్ చేస్తాడు. అవసరం లేకున్నా వార్తకు రెండు లేదా మూడు ఫోటోలు పెట్టి చూసావా నీ వార్త ఎలా ఉందొ అంటూ మరుసటి రోజు ఉదయం ఆ ఎడిషన్ ఇంచార్జ్ ఫోన్ చేస్తాడు. అవసరాలకు ఆదుకునే వారు వార్తలు ఎప్పుడు పంపినా సమ్మతమే. నిర్ణీత సమయాని కంటే ముందుగానే వార్తలు పంపినా రిపోర్టర్లను వేదిస్తాడు అనే పేరు సంపాదించుకున్నాడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.
సోషల్ మీడియా లో వైరల్ బూతు పురాణం కరీంనగర్ లోని పత్రిక బ్రాంచ్ మేనేజర్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. ఈ విషయంపై బ్రాంచ్ మేనేజర్ కూడా ఆ ఎడిషన్ ఇంచార్జ్ ను శుక్రవారం పిలిచి వివరణ కోరినట్టుగా సమాచారం. బ్రాంచ్ మేనేజర్ వివరణ కోరిన విషయాన్ని ఆ ఎడిషన్ ఇంచార్జ్ పలువురి వద్ద గొప్పగా చెప్పుకోవడం విశేషం. ఆదిలాబాద్ లో పలువురు రిపోర్టర్ లను కూడా ఆ ఎడిషన్ ఇంచార్జ్ డబ్బుల కోసం వేదించినట్టుగా ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. చిన్న, చిన్న ఆరోపణలకు, యాజమాన్యం ఆశించినంత యాడ్స్ ఇవ్వక పోయినా, యాజమాన్యం చెప్పినంత పేపర్ చందా ఇవ్వకపోయినా రిపోర్టర్ లను తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక బాధ్యత గల ఎడిషన్ ఇంచార్జ్ బూతు పురాణం వల్లెవేయడం విషయం తెలిసి కూడా పత్రిక యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు రిపోర్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.