Love : హీరో మహేష్ బాబుతో తెలుగు సినిమాలో అడుగుపెట్టింది. ప్రభాస్ తో కలిసి కూడా నటించింది. ఆ రెండు సినిమాలతోనే ఆ బ్యూటీ అభిమానులను సంపాదించుకొన్న హీరోయిన్ ఇప్పుడు ప్రేమలో పడింది. ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. కబీర్ బహియాతో ప్రేమలో పడినట్టుగా ఇటీవల బాలీవుడ్ లో పెద్ద టాక్ అయ్యింది. కృతి సనన్, కబీర్ బహియా కలిసి దుబాయ్ లో దిగిన ఫోటోలు కూడ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టాయి. కానీ ఆ ఫోటోలపై ఆ బ్యూటీ ఇప్పటివరకు కూడా నోరుమెదపలేదు.
ఇటీవల కృతి సనన్ పుట్టిన రోజు ఘనంగా జరిగింది. పుట్టిన రోజుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియా ను ఊపేశాయి. కృతి సనన్ పుట్టిన రోజు వేడుకల్లో కబీర్ బహియా సైతం ఉన్నాడు. దింతో కృతి సనన్ డేటింగ్ కూడా చేసినట్టు పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. కబీర్ యూకే కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుళ్జిందర్ ట్రాన్స్ పోర్ట్ వ్యాపారస్తుడు. లండన్ లో ఉన్న సంపన్న కుటుంబాల్లో కబీర్ వాళ్ళది కూడా ఒక సంపన్న కుటుంబం. కబీర్ ఆస్తి సుమారు రూ : 3500 కోట్లు ఉంటుందని అంచనా.
కబీర్ తన వ్యాపారంతో పాటు, తన తండ్రి వ్యాపారం కూడా చూస్తున్నాడు. కబీర్ వయసు ఇప్పుడు కేవలం 24 ఏళ్ళు మాత్రమే. ఇది ఇలా ఉండగా కృతి వయసు 34 ఏళ్లలో అడుగుపెట్టిందని సమాచారం. వీళ్లిద్దరి మధ్య వయసు పదేళ్ల తేడా ఉంది. గతంలో ఒకసారి లండన్లో కబీర్ చేయి పట్టుకొని కృతి నడిచిన ఫోటోలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో .
ఏది ఏమైనప్పటికి కూడా కబీర్ తో ప్రేమ్ లో పడిందా ? లేదా ? అనే విషయాన్నీ స్పష్టం చేయాల్సింది కృతి సనన్. అప్పటి వరకు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ విషయంలో వచ్చిన వార్తలన్నీ కూడా ఆరోపణలే అని అనుకోవాలి.