NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Telugu Cinema : అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమా ఏది ? ఆ సినిమా హీరో ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Telugu Cinema : తెలుగు నినిమా చరిత్రలో అప్పటివరకు ఏ సినిమా కూడా అత్యధిక కలెక్షన్లు సాధించలేదు. ఏ హీరో కూడా ఆ ఘనత సాధించలేదు. అత్యధిక వసూళ్లు సాధించిన ఆ సినిమా నేటికి సరిగ్గా 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంత ఘనమైన చరిత్ర సృష్టించిన ఆ సినిమాను ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు సినీ నిర్మాత. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వైజయంతి బ్యానరుపై సినిమా తీశారు. సినిమా మొత్తం బడ్జెట్ రూ : 7 కోట్లు. అందులో సినిమా హీరో పారితోషకం లేదు. సినిమా షూటింగ్, రికార్డింగ్, రి రికార్డింగ్, డబ్బింగ్ అంత 120 రోజుల్లో పూర్తి చేశారు. 2022, జూలై 22 న విడుదల చేశారు. ముందుగా పదకొండు పాటలతో సినిమా తీయాలనుకున్నారు. కానీ ఆ సినిమాను ఐదు పాటలకే పరిమితం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో సినిమా 268 థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. అత్యధిక సినిమా హాళ్లల్లో 50 రోజులు, వంద రోజులు ఆడింది. పలు పెద్ద నగరాల్లో 175 రోజులు కూడా ఆడింది. విజయవాడలో పెద్ద ఎత్తున ఉత్సవం జరుపకొంది సినిమా బృందం. ఆ ఉత్సవానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా హాజరు కావడం విశేషం.

50, 100, 175 రోజులు నడిచిన ఆ సినిమా అప్పటి వరకు కూడా ఏ హీరో సినిమా కూడా సాధించని రికార్డ్ సాధించి పెట్టడం విశేషం. హీరో పారితోషకం కాకుండా రూ 7 కోట్లతో నిర్మించిన ఆ సినిమా ఏకంగా రూ 50 కోట్ల కలెక్షన్లు సాధించి కొత్త చరిత్రను సృష్టించింది. అప్పటి వరకు ఏ హీరో సినిమా కూడా అంత కలెక్షన్ సాధించలేదు.

ఇంతకు ఆ సినిమా పేరు ఏమిటి, ఆ సినిమా హీరో ఎవరు అని ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ సినిమా హీరో ” మెగా స్టార్ చిరంజీవి ” ఆ సినిమా పేరు ” ఇంద్ర ” . ఇంద్ర రికార్డ్ తరువాతనే మహేష్ బాబు ” పోకిరి ” సినిమా తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్ సాధించింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.