Govt Job : సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. అందులో పర్మినెంట్ జాబ్. అన్ని అలవెన్సులు కలిపి ప్రతినెల ఒక లక్ష ఎనబై వేల వేతనం. ఒకే ఒక్క అర్హత ఉంటె సరిపోతుంది. ఆ అర్హత ఉంటె ఆ ఉద్యోగం మీదే. నెల జీతం దాదాపుగా ప్రతినెల రెండు లక్షలు మీవే. ఇంకెందుకు ఆలస్యం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. వెంటనే దరఖాస్తు చేయండి. ఉద్యోగం పొందండి. వివరాలు ఇలా ఉన్నవి.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లో భారీ వేతనంతో జాబ్ నోటిఫికేషన్ ప్రకటన విడుదల అయింది. మొత్తం 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం సెయిల్ ఇండియా సంస్థ నోటిఫికేషన్ ప్రకటించింది. ఎంపికయిన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సెయిల్ స్టీల్ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
కెమికల్ ఇంజినీరింగ్ – 10 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ – 21 పోస్టులు, కంప్యూటర్ ఇంజినీరింగ్ – 9 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ – 61 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 5 పోస్టులు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ – 11 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్ – 69 పోస్టులు, మెటలర్జీ ఇంజినీరింగ్ – 63 పోస్టులు ఖాలీగా ఉన్నాయి.
సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. ఇంజనీరింగ్ అర్హత తో పాటు గేట్-2024 స్కోర్ కూడా అదనంగా తప్పనిసరి ఉండాలి. దాదాపుగా ఇంజనీరింగ్ చదివి 65 శాతం మార్కులతో ఉతీర్ణులై ఉంటారు. ఒకే ఒక్క అర్హత అదనంగా గేట్ స్కోర్ ఉంటె కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం మీ సొంతం అవుతుంది.
దరఖాస్తు చేయడానికి , మరిన్ని వివరాల కోసం సెయిల్ అధికారిక వెబ్సైట్ https://www.sail.co.in/ ను అనుసరించండి.