Railway Jobs : గోరఖ్‌పూర్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలో ఉన్నటువంటి వర్క్‌షాప్,యూనిట్లలో 1104 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 2024, జులై 11.
దరఖాస్తు చేసుకునే వారు కనీసం 50 % మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి పదో తరగతి తోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2024 జూన్ 12 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో అభ్యర్థుల వయస్సు ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్టీ, ఎస్సీలు,మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.10వ తరగతి, ITI పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో స్టైపెండ్ మంజూరు చేస్తారు. https://ner.indianrailways.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.RRC NER Apprentice Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేసి ఆన్ లైన్ లోనే ధరఖాస్తు పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలి.
గోరఖ్‌పూర్ లో ఫిట్టర్-140, వెల్డర్-62, ఎలక్ట్రీషియన్-17, కార్పెంటర్-89, పెయింటర్-87, మెషినిస్ట్-16, లక్నో జంక్షన్లో ఫిట్టర్-120, వెల్డర్-06, ట్రిమ్మర్-06, కార్పెంటర్-11, పెయింటర్-06, మెషినిస్ట్-06, ఇజ్జత్‌నగర్ లో ఫిట్టర్-39, వెల్డర్-30, ఎలక్ట్రీషియన్-32, కార్పెంటర్-39, పెయింటర్-11, వారణాసిలో ఫిట్టర్-66, వెల్డర్-02, కార్పెంటర్-03, ట్రిమ్మర్-02, పెయింటర్-02, ఇజ్జత్‌నగర్లో ఫిట్టర్-64, గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌లో ఫిట్టర్-31, వెల్డర్-08, టర్నర్-15, కార్పెంటర్-03, మెషినిస్ట్-06, ఇజ్జత్‌నగర్ లో ఎలక్ట్రీషియన్-30, మెకానికల్ డీజిల్-30, గోరఖ్‌పూర్ కంటోన్మెంట్ లో ఫిట్టర్-21, వెల్డర్-11,మెషినిస్ట్-03, గోండా జంక్షన్ లో ఫిట్టర్-13, వెల్డర్-02, ఎలక్ట్రీషియన్-20, మెకానిక్ డీజిల్-55 ఖాలీలు ఉన్నాయి.