SSC Jobs : కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ). నిరుద్యోగులకు భారీ శుభ వార్త ప్రకటించింది. ఒకేసారి పెద్దమొత్తంలో ఖాళీలను భర్తీ చేయనుంది. కేవలం డిగ్రీ అర్హత తోనే నియామకం చేపట్టనుంది SSC. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు మాత్రం డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదా ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కు డిగ్రీలో స్టాటిస్టిక్స్ తప్పనిసరి
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 17,727 ఖాళీలు ఉన్నాయి. నియామకం అయిన మొదటి నెల వేతనం కనీసం రు : 80 వేలు చేతికి అందుతుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వయో పరిమితి : ఆగస్టు 1, 2024 నాటికి గ్రూప్-బీ పోస్టులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. అదేవిదంగాగ్రూప్-సీలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు 30 ఏళ్ళు. మిగిలిన ఉద్యోగాలకు 27 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఇస్తూ ప్రకటన వెలువడింది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. రూ.100 పరీక్ష రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. జూలై 24 తేదీ రాత్రి 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ http://ssc.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు : తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలల్లో పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. అదేవిదంగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం ప్రాంతాల్లో పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేశారు.