NIGAMA MEDIA (P) LTD
21.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Vijay Devara konda : విజయ్ దేవరకొండతో ఆ నటి ఒప్పుకొంది

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Vijay Devara konda : ప్రముఖ నటుడు విజయ్ దేవర కొండ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. గీత గోవిందం సినిమాతో ఒక రేంజ్ లోకి దూసుకుకెళ్ళాడు. అదే స్థాయిలో విజయాలు సాధించాలనుకున్నాడు విజయ్. కానీ ఆ ఆశలకు తగిన విదంగా అవకాశాలు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలను మాత్రం విజయ్ దేవరకొండ అందుకోలేక పోయారనే అభిప్రాయాలు చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. ఇటీవలనే విజయ్ దేవర కొండ తన పుట్టినరోజు వేడుకలను అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు.

లైగర్ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయింది. ఆ తరువాత వచ్చిన ఖుషి సినిమా కూడా విజయ్ దేవర కొండ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేదు. రెండు సినిమాలు అభిమానులను నిరుత్సహ పరిచాయి. ఇటీవల విడుదల అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా మీద అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ ను అందుకోలేక పోయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా అభిమానుల అంచనాలను అందుకోలేక పోయింది. ఇప్పుడు విజయ్ దేవర కొండ నుంచి అభిమానులు ఒక పెద్ద హిట్ సినిమా రావాలని కోరుకుంటున్నారు.

పుట్టినరోజు పురస్కరించుకొని గొప్ప విజయం సాధించాలనే కోరికతో మూడు సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ఒకేసారి మూడు సినిమాల్లో నటించడానికి ఒప్పుకోవడంతో మూడింటికి మూడు కూడా ఘన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక సినిమాలో మాత్రం విజయ్ దేవర కొండ సరసన నటించడానికి సాయి పల్లవి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమెతో నటిస్తున్న సినిమానే ముందుగా అభిమానుల, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్రం యూనిట్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రాన్ని వేగవంతముగా పూర్తి చేయనున్నారని సమాచారం. కథ సిద్దమైనప్పటికీ, సినిమా పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అతి త్వరలోనే పేరు ఖరారు చేసి అభిమానులకు తెలుపడానికి సినిమా దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

దేవరకొండకు ఉన్న కొండంత అభిమానులకు తోడుగా సాయి పల్లవి కూడా జత కడితే విజయం పక్కా అవుతుందని సినీ పరిశ్రమలో చర్చ కూడా మొదలైనది. ఫిదా సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన ముహూర్తం పల్లవికి కలిసివచ్చింది. వరుసగా హిట్ కొడుతూ పరిశ్రమలో తిరుగులేని నటిగా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ సినిమా తో తీరిక లేకుండా ఉంది. చేతిలో మరిన్ని కథలు కూడా ఉన్నవి. అయినా విజయ్ దేవర కొండతో నటించడానికి ఆమె సిద్దంగానే ఉన్నట్టు సమాచారం. పక్కా ప్రేమ కథా రూపంలో సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. హీరో, హీరోయిన్ లకు తగిన విదంగా హాస్యం పండిస్తున్నారు. ప్రేమ కథకు తగినవిదంగా విలన్ పాత్ర కూడా ఉండబోతోంది. విజయ్ కి సరిపడే విదంగా విలన్ ను ఎంపిక చేయబోతున్నారు. విజయ్ దేవర కొండ, సాయి పల్లవి కలిసి జంటగా నటిస్తున్న ఈ కొత్త సినిమా అభిమానుల ఆశలకు తగ్గట్టుగా ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.