16.6 C
Munich
Monday, July 27, 2026

CM Revanth reddi : తెలంగాణ లో మారనున్న పథకాల పేర్లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CM Revanth reddi : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సమయం కరువైనది. పరిపాలనను గాడిలో పెడుదామనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి హామీ కానీ, నిధుల మంజూరు కానీ చేయడానికి వీలులేకుండా పోయింది. ఏ పని చేద్దామన్న ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ప్రజల్లోకి వెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు గుప్పించాయి. రైతు రుణమాఫీ, రైతుబందు పథకాల అమలులో సీఎం రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ దుమ్మెత్తి పోశారు. కరెంట్ సమస్య పెరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు తెలంగాణ నుంచి మామూళ్లు వెళుతున్నాయని ఆరోపించారు. RRR టాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ఇలా పార్లమెంట్ ఎన్నికల వాతావరణాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి ని ఒక అట ఆడు కున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే ఆయన పూర్తి స్థాయి
లో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.ఈ నేపథ్యంలో తన పరిపాలన రుచి ఏమిటో చూపించబోతున్నారు.

పరిపాలన పగ్గాలు చేతపట్టిన కొద్దిరోజుల్లోనే రైతు బందు పథకం పేరు మార్చివేశారు. టీజీ బదులు టీఎస్ చేశారు. మనబడి పథకానికి అమ్మ ఆదర్శ పాఠశాల గా మార్చివేసింది ప్రభుత్వం. కొత్తగా వచ్చే రేషన్ కార్డులు, డబల్ బెడ్ రూమ్, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్, తదితర పథకాల పేర్లను మార్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఢిల్లీ లో ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే పార్టీ విధేయులకు మంత్రి పదవుల వచ్చే అవకాశం కూడా ఉంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారంకు కొంత సమయం పడుతుంది. అది పూర్తయిన వెంటనే పరిపాలన పై పూర్తి స్థాయిలో పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.