NIGAMA MEDIA (P) LTD
23.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

బీబీపేట అంగన్‌వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆశీర్వాదాలు అందజేసిన ప్రజాప్రతినిధులు
గ్రామస్థుల భాగస్వామ్యంతో విజయవంతమైన వేడుక

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట);

బీబీపేట మండలం యాడారం హరిజనవాడ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు సంప్రదాయబద్ధంగా శ్రీమంతాలు నిర్వహించి, వారి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వార్డు సభ్యులు కొత్తపల్లి పూజ, బ్యాగరి సుజాత, అంగన్‌వాడీ టీచర్లు అనురాధ, నరసవ్వ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అనంతరం గర్భిణీలకు పండ్లు, పౌష్టికాహార పదార్థాలు అందజేసి, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు గర్భిణీలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ ప్రతి కుటుంబం బాధ్యత అని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ముగిసింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.