NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Devara First Song : కేక పుట్టిస్తున్న ” దేవర ” ఫస్ట్ సాంగ్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Devara First Song : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ” దేవర “. సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కనీసం ఒక పాట అయినా చూడాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఆశలు అడియాశలు కాలేదు. ఫస్ట్ సాంగ్ రానే వచ్చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా పాటను తీర్చి దిద్దారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. దర్శకుడు కొరటాల శివ. అనిరుద్ రవి చంద్రన్ ట్యూన్స్ అదరగొట్టాడు. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం విశేషం. ఇంకేముంది ఆయన పుట్టిన రోజు కంటే ఒక రోజు ముందుగానే అభిమానులు ఫస్ట్ సాంగ్ తో పండుగ చేసుకున్నారు. దేవర ఫస్ట్ సాంగ్ అభిమానుల్లో కేక పుట్టిస్తోంది.

దేవర సినిమాలో హీరో క్యారెక్టర్ ను చాల విశాలంగా వైల్డ్ గ చిత్రీకరించారు. ఫైటింగ్ సన్నివేశాలు చూస్తున్నంత సేపు ఇంకా చూడాలనే విదంగా చిత్రీకరించారు దర్శకుడు శివ. హీరో విలన్, అతని అనుచరులపై చేసిన పోరాటం చాల రిస్క్ తో కూడుకున్నవి.

ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి ప్రేక్షకులను ఆకట్టుకునే విదంగా చక్కని సాహిత్యాన్ని అందించారు. యతి ప్రాసలు, పాదాల పొందిక, పదాల వర్ణన ఎంతో గమ్మత్తుగా, నవ్వుకునే విదంగా ఉన్నాయి. ఆదివారం విడుదల అయిన మొదటి పాట చాల రిస్క్ తో తీశారు. విజువల్స్ కు చాల ఖర్చు చేశారు. సినిమా అంచనాలనే మొదటి పాట అనుకున్నదానికంటే ఎక్కువగానే పెంచేసింది. దీనితో సినిమా సాంకేతిక వర్గం, నటి,నటులు, దర్శక, నిర్మాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దేవర సినిమాను అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.