“హక్కులు తెలుసుకోండి.. బాధ్యతలు నిర్వర్తించండి”
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే మహోన్నతమైనది “రాజ్యాంగమే దేశ ప్రజాస్వామ్యానికి పునాది” “అంబేద్కర్ ఆశయాలే రాజ్యాంగానికి బలం” మందమర్రి సీఐ పర్స రమేష్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత విలువైన, మహోన్నతమైన రాజ్యాంగమని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, పౌర బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు. గురువారం మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య...