NIGAMA MEDIA (P) LTD
1.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, November 23, 2026

సింగరేణి సేవా సమితి వృత్తి విద్యా శిక్షణకు ఫ్యాకల్టీ ఎంపిక

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న వృత్తి విద్యా శిక్షణ కోర్సులకు ఫ్యాకల్టీ ఎంపిక కోసం సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ ఎంపిక ప్రక్రియలో టైలరింగ్‌కు రెండు కోర్సులు, ఫ్యాషన్ డిజైనింగ్‌కు రెండు కోర్సులు, బ్యూటీషియన్‌కు ఒక కోర్సు, కంప్యూటర్ శిక్షణకు ఒక సెంటర్‌ చొప్పున మొత్తం ఆరు విభాగాలకు ఫ్యాకల్టీని ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టుల కోసం మొత్తం 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న వృత్తి విద్యా శిక్షణ కోర్సుల ద్వారా అనేక మంది స్థానికులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు త్వరలో ప్రారంభం కానున్న శిక్షణ తరగతులకు శిక్షకులుగా నియమితులవుతారని పేర్కొన్నారు.ఇంటర్వ్యూ ప్రక్రియను ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఎఫ్‌అండ్‌ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, సీనియర్ పీవో ఆర్. సత్యనారాయణ పర్యవేక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.