సింగరేణి సేవా సమితి వృత్తి విద్యా శిక్షణకు ఫ్యాకల్టీ ఎంపిక

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న వృత్తి విద్యా శిక్షణ కోర్సులకు ఫ్యాకల్టీ ఎంపిక కోసం సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ ఎంపిక ప్రక్రియలో టైలరింగ్‌కు రెండు కోర్సులు, ఫ్యాషన్ డిజైనింగ్‌కు రెండు కోర్సులు, బ్యూటీషియన్‌కు ఒక కోర్సు, కంప్యూటర్ శిక్షణకు ఒక సెంటర్‌ చొప్పున మొత్తం ఆరు విభాగాలకు ఫ్యాకల్టీని ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టుల కోసం మొత్తం 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,...