632 మందికి నూతన చేయూత పెన్షన్ మంజూరి పత్రాల పంపిణీ

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): లక్షెట్టిపేట్ మండల, మున్సిపాలిటీ పరిధికి చెందిన 632 మంది చేయూత పెన్షన్ లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరి పత్రాలను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎంపీఓ, ఎంపీడీఓ ఇన్‌చార్జి అనిల్‌తో పాటు సంబంధిత అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా...