19న సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి

బహిరంగ సభలో ఇందిరమ్మ భీమా పథకం ప్రకటన రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: సిద్దిపేటలో ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ భీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు...