ఎథిక్ అకాడమీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..
చిన్నారుల సృజనాత్మకతకు ‘అవతార్–2026’ వేదిక ఆకట్టుకున్న ఇతివృత్త ఆధారిత వేషధారణ పోటీ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ, సమాజం పట్ల అవగాహన, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్లో ఉన్న ఎథిక్ అకాడమీ – ది ఎలిమెంటరీ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అవతార్–2026’ పేరుతో నిర్వహించిన వినూత్న ఇతివృత్త ఆధారిత వేషధారణ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణ వేషధారణ పోటీలకు భిన్నంగా, ప్రతి విద్యార్థి...