అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీ

భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన రాత్రి పెట్రోలింగ్, పోలీస్ నిఘా పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్‌తో కలిసి రైల్వే స్టేషన్ పరిసరాలను సందర్శించిన ఆయన, రైల్వే సిబ్బంది, దుకాణాల యజమానులు, ప్రయాణికులతో మాట్లాడి అక్కడి భద్రతా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక పోలీసులు...