మధ్యాహ్న భోజన బియ్యం తరలింపుపై విద్యాశాఖ వివరణ

అక్రమ తరలింపు జరగలేదు.. శుభ్రపరిచేందుకే పక్కింటికి తీసుకెళ్లారు: డీఈఓ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల: జిల్లాలోని భీమిని మండల పరిధిలో ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌ భీమిని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని తరలించినట్లు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మండల విద్యాశాఖాధికారి సమర్పించిన నివేదిక ప్రకారం.. నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పాఠశాలలో నిల్వ ఉన్న...