బీబీపేట్ పద్మశాలీలకు జిల్లా సంఘంలో కీలక బాధ్యతలు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట్ మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తుమ్మ మచ్చేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనర్సింలుకు మండల సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిరిగాద లక్ష్మీనర్సింలు మాట్లాడుతూ పద్మశాలీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ఐక్యతే ప్రధాన బలమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లా మహిళా సంఘం, యువజన సంఘాల ఏర్పాటుకు...