NIGAMA MEDIA (P) LTD
10.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 18, 2026

సీతారామ కాలనీలో వైభవంగా దుర్గాదేవి పూజలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

వేద మంత్రోచ్చారణలు, హోమాగ్నితో ఆధ్యాత్మిక శోభ
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

జిల్లా కేంద్రంలోని సీతారామ కాలనీ హనుమాన్ దేవాలయంలో దేవీ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని శుక్రవారం దుర్గాదేవి పూజలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలు, దైవనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా కాయితపు శ్రీ లత -రవీందర్ దంపతులు వేద పండితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ హోమాగ్నికి ఆహుతులు సమర్పిస్తూ అమ్మవారి అనుగ్రహం, లోకకల్యాణం, సకల జనుల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీతారామ కాలనీకి చెందిన భక్తులతో పాటు సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలను పొందారు. భక్తి భావంతో సాగిన ఈ పూజా కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.