NIGAMA MEDIA (P) LTD
10.7 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Saturday, October 17, 2026

బీబీపేట్ లో అట్ల బతుకమ్మ వేడుక

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బీబీపేటలో మహిళలతో కలిసి ఆటపాటలు
సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా బీబీపేట మండలంలోని బీబీపేట గ్రామంలో మహిళలు, ఆడపడుచులతో కలిసి తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. పండుగ సందర్భంగా అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడపడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

ఏడాదికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమని, ఈ పండుగను అందరూ ఐకమత్యంతో ఆనందంగా జరుపుకోవాలని ఆమె అన్నారు. అయితే, ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలకు కనీసం చీరలు కూడా అందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ, ప్రభుత్వం మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఈ నెలలో జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకొని బీబీపేట గ్రామంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కొరివి నీరజ విజ్ఞప్తి చేశారు. సుమారు 10 వేల జనాభా ఉన్న బీబీపేటలో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు బతుకమ్మల ఊరేగింపు నిర్వహించే అవకాశం ఉన్నందున, పెద్ద సంఖ్యలో మహిళలు ఒకేసారి తరలివచ్చే ప్రాంతాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా ముదిరాజ్ వాడ కాలనీ నుంచి బతుకమ్మలు వెళ్లే మార్గాల్లో విద్యుత్ దీపాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించి వేడుకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు నూరేళ్లు జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు పాల్గొని కొరివి నీరజతో కలిసి ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాబోయే బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రతి కాలనీలో ప్రభుత్వం తగిన లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.