సీతారామ కాలనీలో వైభవంగా దుర్గాదేవి పూజలు
వేద మంత్రోచ్చారణలు, హోమాగ్నితో ఆధ్యాత్మిక శోభ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జిల్లా కేంద్రంలోని సీతారామ కాలనీ హనుమాన్ దేవాలయంలో దేవీ నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని శుక్రవారం దుర్గాదేవి పూజలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్చారణలు, దైవనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా కాయితపు శ్రీ లత -రవీందర్ దంపతులు వేద పండితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించి, దుర్గాదేవికి ప్రత్యేక పూజలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ హోమాగ్నికి ఆహుతులు...