NIGAMA MEDIA (P) LTD
8.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Monday, October 12, 2026

జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన పెను ప్రమాదం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో లిఫ్ట్ తెగిపడిన ఘటన..
ఒక కార్యకర్తకు స్వల్ప గాయాలు

కోల్ బెల్ట్ న్యూస్(జగిత్యాల)

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాలలోని ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి, ఇతరులు లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా తెగిపడింది.

లిఫ్ట్‌లో మంత్రితో పాటు ఒకేసారి ఎక్కువ మంది ఉండటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. అయితే లిఫ్ట్ స్వల్ప ఎత్తు నుంచే కిందకు పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సురక్షితంగా బయటపడగా, ఓ కార్యకర్తకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.