జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన పెను ప్రమాదం
బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో లిఫ్ట్ తెగిపడిన ఘటన.. ఒక కార్యకర్తకు స్వల్ప గాయాలు కోల్ బెల్ట్ న్యూస్(జగిత్యాల) మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాలలోని ఓ బాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి, ఇతరులు లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా లిఫ్ట్ అకస్మాత్తుగా తెగిపడింది. లిఫ్ట్‌లో మంత్రితో పాటు ఒకేసారి ఎక్కువ మంది ఉండటమే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. అయితే లిఫ్ట్ స్వల్ప ఎత్తు...