NIGAMA MEDIA (P) LTD
10.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 11, 2026

సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

ఈ నెల 14వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మందమర్రి పట్టణ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మందమర్రి పట్టణంలోని TBGKS యూనియన్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గోదావరిఖనిలో జరగనున్న కార్మిక గర్జన సభకు మందమర్రి పట్టణం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, TBGKS యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో కృషి చేయాలని నాయకులకు సూచించారు. సభకు కార్మికులు, పార్టీ శ్రేణులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం……….

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను సభ వేదికగా ప్రస్తావించి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభ విజయవంతానికి పార్టీ నాయకులు, యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కోరారు.

పలువురు నాయకుల హాజరు……

ఈ సమావేశంలో మందమర్రి పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, TBGKS మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బెల్లం అశోక్, పార్టీ సీనియర్ నాయకులు ఎం.డి. అబ్బాస్, బత్తుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, బోరిగం వెంకటేష్, బర్ల సదానందం, బుపెల్లి కనకయ్య, కనకం రవి, పల్లె నర్సింగ్, మేడిపల్లి మల్లేష్, దాసరి రాజనర్సు, శంకర్, పూసల ఓదెలు, మొగురం శ్రీనివాస్, రవి వర్మ, ఐ. రమేష్, తోగరి వెంకటేష్, మటన్ శేఖర్, వొద్దాం సాగర్, నరహరి, 16వ వార్డు రమేష్ పాల్గొన్నారు. యువ నాయకులు బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, ఎం.డి. ముస్తఫా, సీపెల్లి సాగర్, రామ్ సురేష్, అందే శ్రీకాంత్, సంగర్తి సంతోష్, ముల్కల రమేష్, తోట వేణు, శనిగారపు అరుణ్ తదితరులు హాజరయ్యారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.