సింగరేణి కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలి

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఈ నెల 14వ తేదీన గోదావరిఖనిలో నిర్వహించనున్న సింగరేణి కార్మిక గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మందమర్రి పట్టణ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం మందమర్రి పట్టణంలోని TBGKS యూనియన్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరిఖనిలో జరగనున్న కార్మిక గర్జన సభకు మందమర్రి పట్టణం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, TBGKS యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సమన్వయంతో...