NIGAMA MEDIA (P) LTD
10.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 11, 2026

ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లోనూ విజయదుందుభి
కార్మికుల ఐక్యశక్తికి నిదర్శనమన్న ఏఐటీయూసీ నాయకులు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

అక్టోబర్ 9న నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల్లోనూ ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ మెజారిటీతో ఆర్టీసీ ఉద్యోగులు ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతు పలకడం కార్మికుల సంఘటిత శక్తికి నిదర్శనమని వారు అన్నారు. శనివారం మందమర్రి యూనియన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ …..

కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం సహా ప్రత్యర్థి సంఘాలను ఎదుర్కొని ఏఐటీయూసీ ఈ విజయం సాధించడం కార్మికుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో తమ సంఘాన్ని ఓడించేందుకు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కార్మికులు తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు. ప్రలోభాలకు లొంగకుండా తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేసే సంఘానికే ఆర్టీసీ ఉద్యోగులు పట్టం కట్టారని వారు అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) బకాయిల చెల్లింపు, పే కమిషన్ అమలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు, కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టడం, కార్మికులపై పనిభారాన్ని తగ్గించడం వంటి ప్రధాన డిమాండ్ల సాధనకు ఎంప్లాయీస్ యూనియన్ కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి, నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో కష్టపడి పనిచేసి యూనియన్‌ను విజయపథంలో నడిపించిన ఆర్టీసీ ఉద్యోగులకు, నాయకులకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టే పోరాటాలకు ఏఐటీయూసీ సింగరేణి విభాగం సంఘీభావ మద్దతుతో పాటు అవసరమైన ఆర్థిక, హార్దిక సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.