ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల్లోనూ విజయదుందుభి కార్మికుల ఐక్యశక్తికి నిదర్శనమన్న ఏఐటీయూసీ నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): అక్టోబర్ 9న నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు డిపోల్లోనూ ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాధుని సుదర్శన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ మెజారిటీతో ఆర్టీసీ ఉద్యోగులు ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతు పలకడం కార్మికుల...