NIGAMA MEDIA (P) LTD
8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, October 9, 2026

ఉమ్మడి పది జిల్లాల్లో బిఆర్ఎస్ ఉత్సవాలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

జిల్లాల దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్‌ సన్నద్ధం!
కొత్త జిల్లాల ఏర్పాటుతో పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
కేటీఆర్‌ దిశానిర్దేశం

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయి పదేళ్లు కావస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) సిద్ధమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, పరిపాలనలో వచ్చిన మార్పులు, పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.

ఈ మేరకు బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అధికార వికేంద్రీకరణ కీలకమైన ఆశయమని, పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఉన్న 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు.

జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన……..

కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణకే పరిమితం కాలేదని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడిందని బీఆర్ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంలో జిల్లాల పునర్విభజన కీలక పాత్ర పోషించిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణల ద్వారా సాధించిన మార్పులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని కేటీఆర్‌ సూచించినట్లు సమాచారం. ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడంతో పాటు, కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఉద్యమించిన జేఏసీల ప్రతినిధులు, ఉద్యమకారులను సన్మానించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

అభివృద్ధిపై ‘అప్పుడు–ఇప్పుడు’ విశ్లేషణ…….

ప్రతి జిల్లాలో గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల ఏర్పాటుకు ముందు పరిస్థితులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు, అభివృద్ధిలో చోటుచేసుకున్న మార్పులను ‘అప్పుడు–ఇప్పుడు’ విధానంలో ప్రజల ముందుంచాలని సూచించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గత పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని గుర్తుచేసే వేదికగా ఈ ఉత్సవాలను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు, తమ పాలనలో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావించేందుకు ఈ దశాబ్ది ఉత్సవాలు పార్టీకి కీలకంగా మారనున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.