ఉమ్మడి పది జిల్లాల్లో బిఆర్ఎస్ ఉత్సవాలు
జిల్లాల దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ సన్నద్ధం! కొత్త జిల్లాల ఏర్పాటుతో పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం కేటీఆర్ దిశానిర్దేశం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయి పదేళ్లు కావస్తున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో అన్ని జిల్లాల్లో వేడుకలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, పరిపాలనలో వచ్చిన మార్పులు, పదేళ్లలో సాధించిన అభివృద్ధిని...