బీబీపేట్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బేడ బుడగ జంగం సంఘం వారి ఆధ్వర్యంలో బీబీపేట్ గ్రామంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గజానన యూత్ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ కుల సంఘాల పెద్దలు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలకు అతీతంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఐక్యత, సోదరభావాన్ని చాటుతూ...